అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, 273వ వారం నిత్య పూలమాల కార్యక్రమంలో కొమ్మిడి విక్రాంత్ రెడ్డి
ఘట్‌కేసర్, జూలై 6: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 273వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం ఘట్‌కేసర్ డివిజన్-6 అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ప్రతినిత్యం స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా అంబేద్కర్...