prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 9:58 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, 273వ వారం నిత్య పూలమాల కార్యక్రమంలో కొమ్మిడి విక్రాంత్ రెడ్డి

ఘట్‌కేసర్, జూలై 6: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 273వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం ఘట్‌కేసర్ డివిజన్-6 అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ప్రతినిత్యం స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలకు బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.

తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ భగత్‌సింగ్‌గా పేరుగాంచిన దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ఘట్‌కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మేకల దాస్, బాలానగరం గణేష్ గౌడ్, బి. శ్యామ్ సుందర్ రెడ్డి, డి. నరేష్, బి. హరీష్, సుభాష్, ఎస్. వంశీ, కె. మహేష్, సాయి, రామ్ యాదవ్, రమేష్ నాయుడు, కె. నర్సింగ్ రావు, కడప రవి, జి. అంజయ్య, బాలానగరం సురేష్ గౌడ్, సి. నిఖిల్, శివకృష్ణ, అరుణ్ గౌడ్, జె. అఖిల్ తదితరులు పాల్గొన్నారు.