అరైవ్ – అలైవ్ పేరుతో సేఫ్టీ సందేశం – చిగురుమామిడి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి); కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిగురుమామిడి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అందరివాడు అంటూ సమానత్వ సందేశాన్ని బలంగా వినిపించారు.అదే వేదికపై పోలీసులు చేపడుతున్న ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ట్రాఫిక్ నియమాలు పాటించడం జీవన రక్షణకు మూలమని చెప్పారు. హెల్మెట్ ధరిస్తే హెయిర్ స్టైల్ మారుతుందేమో కానీ, ధరించకపోతే జీవితమే ముగుస్తుందని హెచ్చరించారు. వాహన పత్రాలు సక్రమంగా ఉండాలని, తనిఖీల సమయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. ప్రతి డ్రైవర్ తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించి జాగ్రత్తగా వాహనం నడపాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామస్తులందరితో రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటిస్తామని ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకోవడంతో పాటు సేఫ్టీ సందేశాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకవరం భవాని, ఏ ఎం సి చైర్మెన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, మాజీ డి సి సి ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, మాజీ డీసీసీ అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్య నారాయణ రెడ్డి,చిట్టుమల్ల శ్రీనివాస్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, గ్రామస్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకోవడంతో పాటు సేఫ్టీ సందేశాన్ని స్వీకరించారు.