prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 10:05 am Digital Edition : ANILKAMAREDDY KAMAREDDY

అంబేద్కర్ అందరివాడు ప్రపంచ మేధావి.

అంబేద్కర్ అందరివాడు
ప్రపంచ మేధావి.

ప్రజావాణి
ఏప్రిల్ :14
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

భారత రాజ్యాంగ నిర్మాత జాతిపిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినమును పురస్కరించుకొని మంగళవారము జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూజెఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణచారి, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ లు మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి దిక్సూచి అనే అన్నారు . మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా గుర్తించిన మేధావి కేవలము డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన జాతిపిత అంబేద్కర్ ఏ కులానికో, ఈ వర్గానికో, ఏ మతానికో చెందిన వ్యక్తి కాదని ఈయన అందరివాడు అని తెలిపారు. కొన్ని శక్తులు ఈయన పేరును చెరిపివేయాలని చూస్తున్నారు కానీ ఈయన పేరును ఎవరు కూడా చెరిపి వేయలేరని ఈయన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు కృష్ణమూర్తి ,జిల్లా మాజీ అధ్యక్షుడు బోక్కల వేణు, రాజేష్ కాషా గౌడ్,
పిట్ల.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.