prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 6:32 am Digital Edition : PRAJA VANI

అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి

ఆర్మూర్ టౌన్,ఆగస్టు 05( మన సమగ్ర ప్రజావాణి):

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామానికి చెందిన కమ్మరి సోనిని ప్రసవం కోసం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ వేదనలు తీవ్రంగా అయ్యాయి. పరిస్థితిని గమనించిన 108 ఈఎంటీ జగదీష్, పైలట్ నరేందర్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. సోని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం నిర్వహించిన 108 సిబ్బంది జగదీష్, నరేందర్‌లను వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.