prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 9:08 am Digital Edition : PRAJA VANI

అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామ నిర్మాణం సాధ్యం<br>

అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామ నిర్మాణం సాధ్యం

* గ్రామసర్పంచ్ తిరుమలవెంకటేష్

*  ఉప సర్పంచ్ శ్రీనాథ్

* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన

జమ్మికుంట ఆగస్టు 7 (ప్రజావాణి)

జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలోగ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ పేర్కొన్నట్లుగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించి ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలంటే ప్రతి గ్రామస్థుడి భాగస్వామ్యం అత్యంత అవసరమని జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారుశుక్రవారం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఆదర్శ గ్రామం  ఆవశ్యకత అంశంపై మినీ గ్రామసభనిర్వహించారుఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. సమిష్టి నిర్ణయాలు ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని పబ్బు సులోచన పేర్కొన్నారుగ్రామ సర్పంచ్ మక్కమల్ల తిరుమలవెంకటేష్ మాట్లాడుతూ బాలవికాస సంస్థ తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం సువర్ణావకాశమని అన్నారుఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాప్రతినిధులు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులందరితో కలిసి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారుఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ మాట్లాడుతూ బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం ఆనందదాయకమని గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్లు కెసుమలత ఏ స్వాతి ఆసియా కారోబార్ లింగమూర్తి, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి వార్డు సభ్యులు సురేష్ సాయిరాం హసీనా శ్రీనివాస్ సాగరిక కళ్యాణి రాజమణి శశివదన ఆంజనేయులు చంద్రమౌళి రాజుఆశా వర్కర్లు సీఏలు అంగన్‌వాడీ టీచర్లు యువజన నాయకులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు