prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 2:04 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అంతా నా ఇష్టం నేను చెప్పింది మీరు వినాలి . ,,

పోరుమామిళ్ల ప్రజావాణి న్యూస్(ఏప్రిల్08) పోరుమామిళ్ల మండల ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ ఓబయ్య ఆఫీసుకు వచ్చిన చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన మురళీమోహన్ రెడ్డి నేషనల్ హైవే రోడ్డు లో విస్తరణ పనులలో భాగంగా మా ఊరిలో బావులు పోయినవి దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ తయారు చేయండి, రైతులకు న్యాయం చేయండి అని ఓబయ్య గారితో మురళి మోహన్ రెడ్డి అడగగా నేను చెయ్యను నీ బుద్ధి పుట్టిన పని చేసుకోండి అని ఏక వచనంతో రైతులను అవమానించిన సంఘటన పోరుమామిళ్ల ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో జరిగింది.విషయం తెలుసుకున్న కొంతమంది జర్నలిస్టులు ఏ ఈ దగ్గరికి వెళ్లి అడగగా మీరెవరు నేను మీకు సమాధానం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.అని ఏక వచనం తో మాట్లాడుతూ విలేకరులపై చిందులు వేసిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఓబయ్య,ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ మీద పైఅధికారికి ఫిర్యాదు చేస్తామని అని జర్నలిస్టులు తెలపగా నీ బుద్ధి పుట్టిన వాళ్లకి చెప్పు కోండి ఏమైనా చేసుకోండి అని విలేకరులపై చిందులు వేశారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని రైతులు చెప్పినా కూడా కలెక్టర్ కే కాదు మీ బుద్ధి పుట్టిన వారికి చెప్పుకోండి అంటూ రైతులపై దుర్భాసలాడాడు.ఇలాంటి వివాదాస్పదమైన ఆర్డబ్ల్యూసీ AE గారిని విధుల నుంచి తొలగించి రిమూవ్ చేయాలని చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన మురళీమోహన్ రెడ్డి,మండల ప్రజలు కోరుతున్నారు.