prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 9:18 pm Digital Edition : PRAJA VANI

అంతర్జాతీయ లైన్స్ క్లబ్ కృషి అధ్యక్షుడిగా అంబటి రమణాకర్ రాజు పదవీ స్వీకారం

అంతర్జాతీయ లైన్స్ క్లబ్ కృషి అధ్యక్షుడిగా అంబటి రమణాకర్ రాజు పదవీ స్వీకారం
ములుగు: అంతర్జాతీయ లైన్స్ క్లబ్ కృషి అధ్యక్షుడిగా మాన్యశ్రీ అంబటి రమణాకర్ రాజు పదవీ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
శాంతమూర్తి, మృదుస్వభావి, నిరంతర శ్రామికుడిగా పేరొందిన అంబటి రమణాకర్ రాజు సమాజసేవనే పరమావధిగా భావిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. నిర్మల హృదయుడు, దయామయుడు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తిగా ఆయనకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
అలుపెరుగని యోధుడు, అసమాన ప్రతిభావంతుడైన అంబటి రమణాకర్ రాజు నాయకత్వంలో లైన్స్ క్లబ్ కృషి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, ఆయన సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఆయన కుటుంబం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.