అంగరంగ వైభవంగా బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
బెజ్జంకి, ఏప్రిల్ 4(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్య ఘట్టమైన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో స్వామివారి ఉత్సవమూర్తులను గుట్టపై నుండి ఘనంగా తీసుకువచ్చి, రథం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి ప్రతిష్టించారు.
అనంతరం ఆలయం ప్రాంగణం చుట్టూ రథోత్సవం భక్తి పరవశంతో కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు దివిటీలు వెలిగించి, కోళ్లు ఎగరవేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.భక్తుల భారీ పాల్గొనికతో రథోత్సవం విజయవంతంగా ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు.