అంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ నాయకుడు వజ్రేష్ యాదవ్, బీఆర్ఎస్ యువ నాయకుడు సామల సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ఈవో భాగ్యలక్ష్మి...