అంగన్‌వాడీ భూమి ఆక్రమణపై ఎమ్మార్వో కు ఫిర్యాదు<br>
*అంగన్‌వాడీ భూమి ఆక్రమణపై ఎమ్మార్వో కు ఫిర్యాదు*-ఆక్రమణ తొలగించాలని కాలనీవాసుల డిమాండ్మందమర్రి, (మన ప్రజావాణి)జూన్ 18 మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ, డోర్లాబంగ్లా 4వ వార్డు కాలనీవాసులు ప్రభుత్వ భూమి ఆక్రమణ అంశంపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.కాలనీవాసుల కథనం ప్రకారం, కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే దారిని మూసివేస్తూ గేటు నిర్మించడం, రహదారి మధ్యలో షెడ్డు ఏర్పాటు చేసి...