అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేసిన- గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ మల్లయ్య
బెజ్జంకి, ఆగస్టు 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శనివారం చిన్నారులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ యంత్రాన్ని ప్రారంభించి,చిన్నారులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక...