prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 10:27 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ,,సిఐటియు,

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) రైల్వే కోడూరు అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి కామ్రేడ్ జాన్ ప్రసాద్,అంగన్వాడి కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి,అధ్యక్షురాలు ఎన్ రమాదేవి,కోశాధికారి జి పద్మావతి,వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి హెల్పర్లకు సంబంధించిన జీవో నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలని,సున్నా సర్వీస్ కింద పనిచేస్తున్న హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేయాలని కోరారు. అలాగే ప్రతి సంవత్సరం మే నెల మొత్తం వేసవి సెలవులు మంజూరు చేయాలని తెలిపారు.మా ప్రాజెక్టులో పనిచేస్తున్న నాలుగు సవరణ మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా ప్రమోట్ చేయాలని,ఒకే పంచాయతీలో పనిచేస్తున్న మినీ వర్కర్లను పక్క సెంటర్లలో మెయిన్ వర్కర్లుగా ప్రమోట్ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడి టీచర్లకు ఇతర శాఖల అదనపు పనులు అప్పగించకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని,అంగన్వాడి ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని,అంగన్వాడి సెంటర్లకు మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు,పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లతీఫ్,వివో ఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు